ఆపరేషన్ సిందూర్‌పై ప్రచారం - సౌదీకి అసదుద్దీన్ ఓవైసీ.. అమెరికాకు శశిథరూర్

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (09:23 IST)
ఉగ్రవాదంపై భారత్ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఉగ్రవాదంపై తమది జీరో టాలరెన్స్‌ వైఖరని చాటి చెప్పడంతో పాటు ఆపరేషన్ సిందూర్‌పై విదేశాలలో ప్రచారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంపీల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఇందుకోసం ఏడు అఖిలపక్ష ప్రతినిధుల జాబితాను ప్రకటించింది. మొత్తం 59 మంది ఎంపీల సభ్యులతో కూడిన ఈ బందాలు ఈ నెల 23వ తేదీ నుంచి 32 దేశాల్లో ప్యటించనున్నాయి. 
 
ఏప్రిల్ 22వ తేదీన పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో దాడికి పాల్పడి 26 మందిని చంపేసిన విషయం తెల్సిందే. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్య చేపట్టింది. ఇందులోభాగంగా, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలో ఉండే ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఉగ్రవాదంపై భారత్ యొక్త జీరో టాలరెన్స్ వైఖరిని, ఆపరేషన్ సిందూర్‌పై విదేశాలలలో ప్రచారం చేయడానికి వివిధ దేశాలకు ప్రయాణించే ఏడు అఖిలక్ష ప్రతినిదుల జాబితాను కేంద్రం శనివారం విడుదల చేసింది. 59 మంది సభ్యులతో కూడిన ఈ బృందాలు మే 23వ తేదీ నుంచి 32 దేశాల్లో పర్యటిస్తాయి. 
 
వీరిలో ఎన్డీయే నుంచి 31 మంది రాజకీయ నేతలు, ఇతర పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలు ఉన్నారు. వారికి  మాజీ దౌత్యవేత్తలు సహాయం చేయనున్నారు. ఈ ప్రతినిధుల బృందాలకు బీజేపీ ఎంపీలు బైజయంత్ జయ్ పాండా, రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జూడీయూ నేత సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ నేత సుప్రియా సూలే నేతృత్వం వహిస్తారు. వారు 32 దేశాలను, బెల్జియంలోని బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం