Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు శరద్ పవార్ దూరం

వరుణ్
బుధవారం, 17 జనవరి 2024 (10:35 IST)
అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ హాజరుకావడం లేదు. తనకు అందిన ఆహ్వానంపై రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌కు బదులిస్తూ.. లేఖ రాశారు. తర్వాత దర్శనానికి వస్తానని పేర్కొన్నారు.
 
'జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత దర్శనానికి వస్తాను. అప్పుడు దర్శనం సులభంగా ఉంటుంది. అంతేగాకుండా అప్పటికి రామ మందిరం నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయి' అని ట్రస్టుకు పవార్‌ వెల్లడించారు. 
 
ఇంతకుముందు కాంగ్రెస్ కూడా ఇదేవిధంగా స్పందించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత అధీర్‌ రంజన్ చౌధరికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న వారు.. దానిని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పొలిటికల్ ప్రాజెక్ట్‌ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 
2024 జనవరి 22న జరిగే ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు. కాశీకి చెందిన పండిట్‌ లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments