Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కిరణ్ బేడీకి లేదు : మద్రాస్ హైకోర్టు

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (16:34 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తేరుకోలేని షాకిచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం సాగిస్తున్న పాలనలో వేలెట్టరాదనీ, మంత్రివర్గాన్ని సంప్రదించకుండా ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
 
కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించింది. ఆమె ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం, సొంత నిర్ణయాలు తీసుకుని అమలు చేయడంసాగారు. దీంతో ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామికి ఆమెకు మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ముఖ్యంగా, ఆ రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లోని వైద్య సీట్ల భర్తీలో చేసుకున్న అవినీతి స్కామ్‌పై లోతుగా పరిశీలించారు. ఇలాంటి చర్యలను  పుదుచ్చేరి సర్కారు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయింది. 
 
అప్పటినుంచి కిరణ్ బేడీకి, పుదుచ్చేరి ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగిపోయింది. దీనిపై ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ విచారణ జరిపింది. పాలనకు సంబంధించి కిరణ్ బేడీ సొంత నిర్ణయాలు తీసుకోరాదని, ఆమె ఇలాంటి విషయాల్లో ఎలాంటి అధికారాలు లేవని తేల్చి చెప్పింది. పుదుచ్చేరి క్యాబినెట్‌ను సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు మదురై బెంచ్ స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments