Webdunia - Bharat's app for daily news and videos

Install App

పకోడీలు అమ్ముకుంటే తప్పేంటి? రాజ్యసభలో అమిత్ షా

నిరుద్యోగంతో మిన్నకుండేకంటే.. పకోడీలు అమ్ముకోవడం మంచిదని.. అందులో సిగ్గుచేటు ఏముందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రధా

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:57 IST)
నిరుద్యోగంతో మిన్నకుండేకంటే.. పకోడీలు అమ్ముకోవడం మంచిదని.. అందులో సిగ్గుచేటు ఏముందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రధాని మోదీ పకోడీ వ్యాఖ్యలపై డిగ్రీ విద్యార్థులు రోడ్లపై పకోడీలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ప్రధానిపై సెటైర్లు విసిరారు. 
 
ఉద్యోగ భద్రతను కల్పించలేని ప్రభుత్వం పకోడీలు అమ్ముకోవాలని చెప్పడం విడ్డూరంగా వుందని నెటిజన్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో మోదీ పకోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. ఉద్యోగం లేకుండా నిరుద్యోగంతో చేతులు ముడుచుకుని కూర్చోవడం కంటే.. ఏదో ఓ పనిచేసుకోవడం లేదంటే పకోడీలు అమ్ముకోవడం మంచిదని.. ఇది సిగ్గుపడాల్సి విషయం కాదని అమిత్ షా బదులిచ్చారు.
 
55 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నిరుద్యోగాన్ని అరికట్టలేకపోయిందని అమిత్ షా విమర్శించారు. యూపీఏ హయాంలో దేశానికి విధానపరమైన పక్షవాతం వచ్చిందన్నారు. మోదీ సారథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జన్‌ధన్ యోజన పెద్ద విజయాల్లో ఒకటని అమిత్ షా ఎత్తి చూపారు. ఇక జీఎస్టీతో దేశానికి ఎంతో మేలు చేకూరుందని.. జీఎస్టీ లీగల్ ట్యాక్స్‌ను గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఎలా అంటారని కాంగ్రెస్‌ను నిలదీశారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ప్రపంచం భారత్‌ను కొత్త కోణంలో చూడటం మొదలెట్టిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments