Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ పాలన ఓ సెల్ఫీ : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్

Webdunia
బుధవారం, 27 మే 2015 (12:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యేడాది పాలనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఘాటైన విమర్శలు చేశారు. మోడీ పాలన సెల్ఫీ పాలన (వ్యక్తి కేంద్రంగా)గా అభివర్ణించారు. భారత్‌ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సెల్ఫ్‌లెస్ (నిస్వార్థ) నేత పాలన కావాలన్నారు. కానీ, మోడీ మాత్రం సెల్ఫీ పాలన కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ‘కేంద్ర కేబినెట్‌లోని మంత్రులందరూ తీసుకున్న సెల్ఫీల కంటే.. ఈ ఏడాదిలో పాలనలో ప్రధాని మోడీ దిగిన సెల్ఫీలే ఎక్కువగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వీనుల విందుగా అనిపించే మాటలతో పేద ప్రజలకు ఒనగూరేది ఏమీ లేదు. ఓ గృహిణి, నిరుద్యోగి, రైతు, ఉద్యోగి, చేతిపనివాడు, విద్యావేత్త.. ఏడాది క్రితం మోడీకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు ఇలా ఎవరిని అడిగినా ఈ ఏడాది పాలనలో మోడీ సర్కార్‌ తమకు ఏమీ చేయలేదని కచ్చితంగా చెబుతారన్నారు. 
 
ఇక రాష్ట్రాల పర్యటనల కంటే.. ఎక్కువ సంఖ్యలోనే మోడీ విదేశాల్లో పర్యటించారు. విదేశాంగ ప్రతినిధులు కూడా అన్ని దేశాల్లో పర్యటించి ఉండరు. మోడీ పాలనలో పాకిస్థాన్‌, చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలు మరింత ముదిరాయి. పేదల కోసం ఆయన ఏమీ చేయలేదు. అసలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇంతవరకూ నెరవేర్చలేదన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments