Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నెలల పాటు టీచర్‌పై ప్రిన్సిపల్ వేధింపులు.. భర్త వార్నింగ్ ఇచ్చినా నో యూజ్.. చివరికి..?

18 నెలల పాటు టీచర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన స్కూల్ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్, నర్మదా జిల్లాకు చెందిన పండపుర గ్రామంలోని ఓ ఉన

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (17:03 IST)
18 నెలల పాటు టీచర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన స్కూల్ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్, నర్మదా జిల్లాకు చెందిన పండపుర గ్రామంలోని ఓ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌పై ప్రిన్సిపాల్ కోహిల్ లైంగికంగా వేధించసాగాడు. ఇందుకు ఆ టీచర్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. అయినా ఆ టీచర్‌ను ప్రిన్సిపల్ ఎక్కడపడితే అక్కడ తాకి మాట్లాడటం వంటి చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. 
 
ఇక లాభం లేదనుకున్న ఆ టీచర్ జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఆ జిల్లా విద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. తన భర్తకు అసలు విషయం చెప్పింది. దీంతో టీచర్‌ భర్త ప్రిన్సిపల్‌ను బెదిరించాడు. ఇంత చేసినా కోహిల్ టీచర్‌పై లైంగిక వేధంపులను ఆపకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కోహిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం