Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రైలు పరిచయం.. హోటల్ గది..

సెల్వి
శనివారం, 19 అక్టోబరు 2024 (13:41 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో 15 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఓ హోటల్ గదిలో ఐదుగురు వ్యక్తులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. 
 
ఈ నెల 4న ఆమె ఒంటరిగా రైలెక్కి ఢిల్లీ చేరుకుంది. రైలులో ఆమెకు పరిచయమైన నిందితులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందినవారు. 
 
5, 6 తేదీల్లో ఢిల్లీ విమానాశ్రయంలో సమీపంలోని హోటల్‌లో ఆమెపై లైంగికదాడి జరిగిందని పోలీసులు తెలిపారు. తన కుమార్తె కనిపించడం లేదని బాధిత బాలిక తండ్రి హల్ద్వానీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
సీసీటీవీ ఫుటేజీలు, బాధితురాలి ఫోన్ లోకేషన్ ఆధారంగా బాలిక ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఉన్నట్టు గుర్తించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు ఆమెను తిరిగి ఈ వారం హల్ద్వానీ చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం