Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ ప్రేమికుల డెత్ వారెంట్లు రద్దుచేసిన సుప్రీంకోర్టు

Webdunia
బుధవారం, 27 మే 2015 (14:19 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రేమికులకు కింది కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్లను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. యూపీకి చెందిన షబ్నం అనే యువతి తన ప్రేమికుడు సలీంతో కలిసి గత 2008 ఏప్రిల్ 15వ తేదీన తన కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసింది. వీరిలో ఓ పాప కూడా ఉంది. 
 
ఈ ఘటనపై నమోదైన కేసులో ప్రేమికులిద్దరికీ 2010లో మరణశిక్ష పడింది. ఈ తీర్పును 2013లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో ఈ నెల 21న డెత్ వారెంట్ జారీ కావడంతో నిందితులు సుప్రీంకు వెళ్లగా, 25న కోర్టు స్టే విధించింది. తాజాగా వారెంట్లను రద్దు చేయడం గమనార్హం.
 
నిందితులు పెట్టుకునే రివ్యూ, మెర్సీ పిటిషన్ల కోసం ఎదురు చూడకుండానే డెత్ వారెంట్ పై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తొందరపాటుతో సంతకం చేశారని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments