Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ మాల్యాకు చీవాట్లు పెట్టిన సుప్రీం కోర్టు... ఒక్క పైసా కూడా చెల్లించలేదా?

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (13:46 IST)
బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఎగవేసి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్​ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి ముంబైలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక కోర్టు మార్గం సుగమం చేసింది. జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు వినియోగించుకునేందుకు అనుమతించింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈ మేరకు ఎస్బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాకు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. దేశంలోని బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న మాల్యాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించకపోవడాన్ని తప్పుబట్టింది. 
 
మాల్యాకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇదివరకే స్వాధీనం చేసుకుంది. వీటిని బ్యాంకులకు అప్పగించడం ద్వారా మాల్యా చెల్లించాల్సిన సొమ్మును ఈడీ రాబట్టుకోవచ్చంటూ కర్నాటక హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. కేసును విచారణ సందర్భంగా.. మాల్యా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. మాల్యాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments