Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వేరొకరితో కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (16:09 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో రిలేషన్‌లో ఉండి ఓ బిడ్డకు జన్మనిచ్చినా, ఆ బిడ్డకు కూడా భర్తే తండ్రి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్య మరొకరితో కన్న పిల్లలకూ భర్తే చట్టబద్ధంగా తండ్రి అవుతాడని పేర్కొంది. 
 
ఎవిడెన్స్ యాక్ట్‌లోని 112వ సెక్షన్ ఇలాగే ప్రెస్యూమ్ చేస్తుందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. భాగస్వాముల మధ్య నాన్ యాక్సెస్‌‍తోనే అక్రమ సంబంధాన్ని ఆరోపిస్తున్న వ్యక్తే నిరూపించాల్సి ఉంటుందని, నిరూపణ కోసం డీఎన్ఏ టెస్టులకు కోర్టులు అనుమతించొద్దని ఆదేశించింది. అక్రమ సంతానంపై కేరళ మాజీ దంపతుల కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
మహాకుంభమేళా తొక్కిసలాట : సుప్రీంలో పిల్ దాఖలు 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మౌని అమావాస్య సందర్భంగా సంగం ఘాట్‌ వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ వ్యాజ్యం నేపథ్యంలో తొక్కిసలాటపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.  
 
కాగా, జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా. 45 రోజుల పాటు జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జనవరి 29 వరకు 27 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments