Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి కొత్త నోట్లేనా... పిల్లలాడుకునే జాలీ నోట్లా...? బయటకొచ్చిన రూ. 50, రూ. 100 నోట్లు?

న్యూఢిల్లీ: కొత్త క‌రెన్సీ చూస్తే అంద‌రికీ ఒక‌టే భావ‌న. అస‌లు ఇది క‌రెన్సీలా లేదని, పిల్ల‌లు ఆడుకునే జాలీ నోట్ల‌లా ఉన్నాయ‌ని టాక్. అవును. గ‌తంలో రిలీజ్ అయి... ఇపుడు ర‌ద్ద‌యిన 500, 1000 నోట్లు గాని, ఇ

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (15:18 IST)
న్యూఢిల్లీ:  కొత్త క‌రెన్సీ చూస్తే అంద‌రికీ ఒక‌టే భావ‌న. అస‌లు ఇది క‌రెన్సీలా లేదని, పిల్ల‌లు ఆడుకునే జాలీ నోట్ల‌లా ఉన్నాయ‌ని టాక్. అవును. గ‌తంలో రిలీజ్ అయి... ఇపుడు ర‌ద్ద‌యిన 500, 1000 నోట్లు గాని, ఇపుడు వాడుక‌లో ఉన్న వంద‌, యాభై నోట్లు గాని చాలా క్వాలిటీగా ఉంటాయి. చివ‌రికి 10, 5 రూపాయ‌ల నోట్లు కూడా ఏళ్ళ త‌ర‌బ‌డి వాడుతున్నా... ఏంతోమంది చేతిలో న‌లుగుతున్నా... వాటికి ఉన్న ఆ క్వాలిటీ త‌గ్గ‌దు. పొర‌పాటున పాత నోటు జేబులో ఉండిపోయి... వ‌ర్షంలో త‌డిసినా, వాషింగ్ మిష‌న్లో వేసేసి తిప్పినా... త‌ర్వాత తీసి ఆర‌బెట్టుకుని, ఇస్త్రీ చేసి వాడుకునే అంత క్వాలిటీగా ఉండేవి. 
 
 
కానీ, ఇపుడు వ‌స్తున్న ఈ కొత్త నోట్లు చూస్తే, బాబోయ్ ఇదేం లో-క్వాలిటీ అనిపిస్తోంది. ఒక ర‌కంగా అవి జాలీ నోట్లా అనే అనుమానం క‌లుగుతోంది. పేప‌ర్ క్వాలిటీ లేదు... రంగు, టెక్ఛ‌ర్... ఇలా ఎందులోనూ క్వాలిటీ క‌నిపించ‌డం లేదు. రు. 2000 నోటు పేరుకే గంభీరంగా ఉంది కానీ నోటులో ఆ దమ్ము లేదు. నోటు ప‌ల‌ుచ‌గా, ఏడాది లోపే చిరిగిపోయేలా క‌నిపిస్తోంది. 
 
ఇంత నాణ్య‌త లేని నోట్లు ఎందుకు త‌యారుచేసిన‌ట్లా అని జ‌నం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇపుడు కొత్త‌గా రిలీజ్ అవుతున్న వంద‌, యాభై నోట్లు చూసినా ఇదే ఫీలింగ్ క‌లుగుతోంది. అంతా మోదీ ద‌య‌, మ‌న ప్రాప్తం అంటున్నారు... జ‌నం. మరి ఈ నోట్లు వానలో తడిస్తే ఎలా ఉంటాయో...? ప్రస్తుతం ఈ నోట్లు వాట్స్ యాప్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ నోట్లు నిజమైనవేనా అనేది తేలాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments