Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశి గొంతెమ్మ కోర్కెలు... జైలు గదిలో ఏసీ, హాట్ వాటర్, టీవీ... న్యాయమూర్తి సీరియస్

శశికళ తన తడాఖా ఏమిటో తమిళనాడు నుంచి బెంగళూరు వరకూ తన కాన్వాయ్ తో చెప్పేసింది. ఈ కాన్వాయ్ చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వున్న జయలలిత సైతం ఇంత హడావిడి చేయలేదనీ, జైలు శిక్ష అనుభవించేందుకు వెళుతే ఇంత పెద్దఎత్తున ఊరేగింపుగా శశిక

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (19:14 IST)
శశికళ తన తడాఖా ఏమిటో తమిళనాడు నుంచి బెంగళూరు వరకూ తన కాన్వాయ్ తో చెప్పేసింది. ఈ కాన్వాయ్ చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వున్న జయలలిత సైతం ఇంత హడావిడి చేయలేదనీ, జైలు శిక్ష అనుభవించేందుకు వెళుతే ఇంత పెద్దఎత్తున ఊరేగింపుగా శశికళ రావడంపై న్యాయమూర్తి ఒకింత ఆగ్రహానికి గురైనట్లు సమాచారం వస్తోంది. 
 
కాగా జైలులో లొంగిపోయేందుకు వెళ్లిన శశికళ గొంతెమ్మ కోర్కెలు కొన్నింటిని న్యాయమూర్తి ముందు వుంచింది. తనను ప్రత్యేక ఖైదీగా చూడాలనీ, తనకు విడిగా అన్ని వసతులు వున్న గదిని కేటాయించాలనీ, దానికి ఏసీ, ఒక టీవీ, వేడివేడి నీరు, మెత్తని బెడ్ తదితరాలన్నీ కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఐతే శశికళ విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆమెను ఓ సాధారణ ఖైదీలా పరిగణించాలనీ, ఆమెతో పాటు మిగిలినవారిని కూడా అలాగే చూడాలని ఆదేశించారు.
 
దీనితో ఆమెకు ఖైదీ నెం. 10711 నెంబరును కేటాయించి, తెల్లచీర ఒకటి ఇచ్చి సాధారణ ఖైదీలుండే కారాగారానికి తరలించారు. ఆమెతో పాటు మరో ఇద్దరు ఖైదీలుంటారు. వీరంతా ఒకే గదిలోనే వుంటారు. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా వున్నారు కనుక ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు కానీ శశికళ విషయంలో అలాంటివేవీ నియమించే అవకాశం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments