Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఫొటో మీద ఒట్టు వేశారు సరే... అసలు ఎమ్మెల్యేలు ఎటువైపు!?

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వస్తాయని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అసలు

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (07:15 IST)
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వస్తాయని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అసలు రాజకీయం ఇపుడే మొదలైంది. 
 
అక్రమాస్తుల కేసులో తనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే శశికళ అత్యంత వేగంగా పావులు కదిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఎటుపోయి ఎటు వస్తుందోననే ఉద్దేశంతో ముందు నుంచే ఆమె తన తర్వాత ఎవరు? అని చర్చలు జరిపారు. 
 
ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగానూ, వేర్వేరుగానూ చర్చించారు. తాను కాకపోతే ఎవరైతే బావుంటుందని ఆరా తీశారు. వారిలో అత్యధికులు పళని స్వామి పేరును ప్రతిపాదించారు. చివరకు, మంగళవారం ఉదయం శాసనసభాపక్ష సమావేశంలో సెంగోట్టయ్యన్, పళని స్వామి, జయ మేనల్లుడు దీపక్‌, తన భర్త నటరాజన్ పేర్లను ఆమె ఎమ్మెల్యేల ముందు ఉంచినట్లు సమాచారం.
 
అధిక శాతం ఎమ్మెల్యేలు పళని స్వామివైపే మొగ్గు చూపారు. బయటకు వెళ్లిన తర్వాత ఎమ్మెల్యేలు చేయి జారిపోయే అవకాశం ఉందని భావించిన శశికళ.. శిబిరంలోనే వారికి బ్రెయిన్‌ వాష్‌ చేశారు. నీతులు చెప్పారు. జయలలిత ఫోటోపై ప్రమాణం చేయించుకున్నారు. మూడున్నరేళ్ల పాటు మిన్నకుండాలని సూచించారు. అప్పటివరకు మీకు (ఎమ్మెల్యేలకు) మంచే జరుగుతుందని హామీ ఇచ్చారు. 
 
తనకు పార్టీ గురించి, ప్రభుత్వం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా కేవలం అమ్మ లక్ష్యసాధన కోసమే తాను ఇంతగా పాటుపడుతున్నానని, అందువల్ల ఎమ్మెల్యేలంతా తనకు అండగా నిలవాలని ప్రాధేయపడ్డారు. అలా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యేలను బతిమిలాడారు. 
 
ఆ తర్వాత రాత్రి 10.30 గంటల సమయంలో ఆమె ఎమ్మెల్యేల విడిది కూవత్తూరు రిసార్ట్స్ నుంచి పోయెస్ గార్డెన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మంత్రులు ఓఎస్‌ మణియన్, రాజేంద్ర బాలాజీ వెంట 16 మంది ఎమ్మెల్యేలు కూడా బయటకు పెళ్లిపోవడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

నవీన్ చంద్ర తన భార్యను టార్చెర్ పెడుతున్నాడంటూ కాలనీవాసుల ఫిర్యాదు !

వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్ - స్కై డైవింగ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments