Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా

Webdunia
ఆదివారం, 31 జనవరి 2021 (17:39 IST)
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఆసుపత్రి వద్ద అనుచరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

అయితే, శశికళ ప్రయాణించిన కారు ముందుభాగంలో అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. కాగా, శశికళను ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఈ పరిస్థితుల్లో ఆమె కారు ముందుభాగంలో ఆ పార్టీ జెండా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. 
 
గత 2017లో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ.. బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా, పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. 
 
మళ్లీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ రావడంతో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్‌ చేశారు. అక్రమాస్తుల కేసులో ఈ నెల 27తో నాలుగేళ్ల శిక్షాకాలాన్ని ఆమె పూర్తి చేసుకున్నారు. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన శశికళను అప్పటి పరిణామాలతో పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ నుంచి బహిష్కరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments