Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లపై కాదు... అసెంబ్లీలో నా బలమేంటో నిరూపిస్తా : ఓ.పన్నీర్ సెల్వం

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం సింహంలా గర్జించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు బహిరంగ సవాల్ విసిరారు. తన బలాన్ని రోడ్లపై కాదు... అసెంబ్లీలో నిరూపిస్తానంటూ ప్రకటించారు. దీంతో

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (11:46 IST)
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం సింహంలా గర్జించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు బహిరంగ సవాల్ విసిరారు. తన బలాన్ని రోడ్లపై కాదు... అసెంబ్లీలో నిరూపిస్తానంటూ ప్రకటించారు. దీంతో పన్నీర్ సెల్వం వర్సెస్ శశికళలు ఢీ అంటే ఢీగా ఎత్తులు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. 
 
మంగళవారం రాత్రి నుంచి తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం గత 12 గంటల్లో రెండోసారి బుధవారం మీడియా ముందుకు వచ్చారు. అసెంబ్లీలో బలపరీక్షకు కూడా సిద్ధమేనని సవాల్ విసిరారు. పార్టీని కాపాడుకునేందుకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. 
 
‘అమ్మ’ చికిత్సకు సంబంధించిన హెల్త్ రికార్డులన్నీ వెలుగులోకి తీసుకొచ్చేలా విచారణ కోరతామన్నారు. తమిళనాడుకు సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ, అధికారంలో ఉన్నప్పుడు గానీ పార్టీకి ఎప్పుడూ విధేయుడిగానే ఉన్నానన్నారు. 
 
పన్నీర్ సెల్వం పార్టీకి ద్రోహం చేసినట్టుగా ఒక్క సంఘటన కూడా జరగలేదన్నారు. ఒకవేళ పార్టీ కార్యకర్తలు తన రాజీనామాను ఉపసంహరించుకోమని కోరితే తప్పకుండా వెనక్కి తీసుకుంటానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టేందుకు ఎందుకు తొందరపడుతున్నారో శశికళనే అడగాలని అన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments