Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళకు గట్టి షాక్.. దినకరన్ ఇంట్లో ఈడీ సోదాలు.. జయమ్మ ఆశయాలు నెరవేరాలంటే?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు గట్టి షాక్ తగిలింది. సీఎం కుర్చీని దక్కించుకోవడం కోసం చిన్నమ్మ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో శశికళ మేనల్లుడు దినకర్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (18:17 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు గట్టి షాక్ తగిలింది. సీఎం కుర్చీని దక్కించుకోవడం కోసం చిన్నమ్మ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో శశికళ మేనల్లుడు దినకర్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. తమిళ రాజకీయాలు క్షణం క్షణం రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దినకర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంపై శశికళ మద్దతుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 
 
గతంలో తమిళనాడు సీఎస్‌గా పనిచేసిన రామ్మోహన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో శశికళ మేనల్లుడు దినకర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంపై శశి వర్గంలో అసంతృప్తి నెలకొంది.
 
ఇదిలా ఉంటే.. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ సమావేశం ముగిసింది. సుమారు గంటపాటు సమావేశమైన శశికళ పార్టీని కాపాడే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యేలకు ఉద్బోధించారు. పార్టీని కాపాడాలంటే కలిసికట్టుగా ఉండాలని వారికి సూచించారు. జయలలిత ఆశయాలు నెరవేరాలంటే అంతా ఐకమత్యంగా ఉండాలని, ప్రత్యర్థుల పన్నాగాలను తిప్పికొట్టాలని ఆమె ఎమ్మెల్యేలకు సూచించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments