Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మ సీనేంటో తేలిపోయింది.. శశికళ రాజభోగాలు మాట నిజమే.. తెల్గికి కూడా?

చిన్నమ్మ సీనేంటో తేలిపోయింది. అక్రమాస్తుల కేసులో పరప్పన జైలులో ఉన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అక్కడ కూడా కుదురుగా లేదు. చిన్నమ్మ అక్కడి జైల్లో రాజభోగాలు అందుతున్నాయని కొద్ది రో

Webdunia
సోమవారం, 24 జులై 2017 (16:00 IST)
చిన్నమ్మ సీనేంటో తేలిపోయింది. అక్రమాస్తుల కేసులో పరప్పన జైలులో ఉన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అక్కడ కూడా కుదురుగా లేదు. చిన్నమ్మ అక్కడి జైల్లో రాజభోగాలు అందుతున్నాయని కొద్ది రోజుల క్రితం ఐపీఎస్‌ అధికారిణి రూపా మౌద్గిల్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా చిన్నమ్మ రాజభోగాలు అనుభవిస్తున్న మాట నిజమేనని స్పష్టం చేసింది. 
 
ఈ కమిటీకి బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అశోక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 15 రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను పూర్తిచేసి.. అధికారులకు సమర్పించారు. శశికళతో పాటు అదే జైల్లో స్టాంప్‌ పేపర్ల కుంభకోణంలో శిక్ష అనుభవిస్తోన్న అబ్దుల్‌ కరీం తెల్గికి బాడీ మసాజ్‌ కోసం జైలు అధికారులు నలుగురిని కేటాయించినట్లు రూప ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలో తెలిపారు.
 
ఇదిలా ఉంటే, బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుల్లో అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ అడుగుపెట్టి వంద రోజులకు పైగా అయ్యాయి. అయితే అన్ని రోజుల పాటు అగ్రహార సెంట్రల్ జైల్లో లేరని తాజాగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలో కేవలం 13 రోజులు మాత్రమే శశికళ ఉన్నారని షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 
 
మిగిలిన రోజులు మొత్తం శశికళ సెంట్రల్ జైలుకు సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉన్నారని వెలుగు చూసింది. ఇటీవల శశికళకు కేటాయించిన గదులు, వంట సామాగ్రి, టేబుల్, కుర్చీలు, టీవీ, ఫ్యాన్ తదితర సదుపాయాలు ఉన్న ఫోటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments