Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారదా చిప్ ఫండ్ స్కామ్ : బెంగాల్ మంత్రికి సీబీఐ నోటీసు!

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (10:45 IST)
వెస్ట్ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో విచారణ జరుపుతున్న సీబీఐ తాజాగా పశ్చిమ బెంగాల్ రవాణా మంత్రి మదన్ మిత్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శ్రిన్ జాయ్ బోస్‌లకు సమన్లు జారీ చేసింది. వీరిని ఒక వారంలోగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. శారదా స్కాంలో ఒక మంత్రికి సమన్లు జారీ కావడం ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్‌తో పాటు ఒడిశాలో, అధిక రాబడి ఉంటుందని నమ్మి శారదా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టి లక్షల మంది నష్టపోయిన సంగతి తెలిసిందే.
 
కాగా, ఇదే కేసులో యేడాది క్రితం అరెస్టు అయి కోల్‌‍కతా జైలులో ఉంటున్న టీఎంసీ రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్‌ ఇటీవలే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విషయం తెల్సిందే. మరోవైపు.. ఈ స్కామ్‌లో తన పాత్ర ఉన్నట్టు ఏ ఒక్క ఆధారం బయటపెట్టినా తాను రాజీనామా చేస్తానని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. తాజాగా టీఎంసీకి చెందిన నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ఆ పార్టీ నేతలు హడలిపోతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments