Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ కుమార్ వేధింపుల్లో పలువురు బాధితులు

ఆప్ బహిష్కృత మాజీ మంత్రి సందీప్ కుమార్ వేధింపుల్లో పలువురు మహిళలు ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా కొందరు మహిళలను లైంగికంగా వేధించినట్లు విచారణలో బయటపెట్టడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (12:24 IST)
ఆప్ బహిష్కృత మాజీ మంత్రి సందీప్ కుమార్ వేధింపుల్లో పలువురు మహిళలు ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా కొందరు మహిళలను లైంగికంగా వేధించినట్లు విచారణలో బయటపెట్టడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నారు. రేషన్ కార్డు కోసం వచ్చిన ఓ మహిళకు మత్తుమందిచ్చి రాసలీలలు కొనసాగించినట్టు టేప్ బహిర్గతం కావడంతో సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకున్న విషయంతెల్సిందే. 
 
ఈ కేసులో సందీప్‌పై అత్యాచారం కేసు నమోదుకావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా గతంలో చాలా మంది మహిళలను లైంగికంగా వేధించడమేగాక, వాటిని వీడియో రికార్డు చేశానని విచారణ సమయంలో సందీప్‌ చెప్పినట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. 
 
కాగా, పలువురు మహిళలను వేధించిన కేసుల్లో సందీప్‌కు సాయపడిన అతడి సన్నిహితుడు ప్రవీణ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిజానిజాలను బయటకు తీసుకొచ్చేందుకు సందీప్‌కు మరో నాలుగు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.
 
అతడి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. అయితే అదంతా ఓ కుట్ర అని సందీప్‌ తొలుత ఆరోపించారు. కాగా.. సాయం కోరి వచ్చిన తనపై అత్యాచారానికి పాల్పడ్డారని సందీప్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సందీప్‌ను అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం