Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

సెల్వి
శనివారం, 21 డిశెంబరు 2024 (12:21 IST)
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇద్దరు యువ‌తులు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం రూ.6లక్షలు ఖర్చు చేశారు వివరాల్లోకి వెళితే.. రాణు, జ్యోతి అనే ఇద్దరు యువ‌తులు ఇలా తాజాగా కన్నౌజ్‌లోని సదర్ కొత్వాలిలో వారి కుటుంబాల అనుమ‌తితో వివాహ‌బంధంలోకి అడుగుపెట్టారు. వారిలో ఒకరు సామాజిక అడ్డంకుల‌ను అధిగ‌మించేందుకు లింగమార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. 
 
కన్నౌజ్‌లోని సదర్ కొత్వాలిలో ఇంద్ర గుప్తా అనే వ్య‌క్తి న‌గ‌ల దుకాణం న‌డుపుతున్నాడు. అత‌ని కుమార్తె శివాంగి. అయితే, ఒక‌రోజు ఆ న‌గ‌ల దుకాణానికి జ్యోతి అనే యువ‌తి వ‌చ్చింది. వీరిద్దరి మధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం, చివరికి ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
అయితే, స్వలింగ వివాహం వల్ల సామాజిక అవమానం త‌ప్ప‌ద‌నుకున్నారు. దాంతో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శివాంగికి లింగమార్పిడి ఆప‌రేష‌న్ చేయించాల‌ని నిర్ణయించుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె లక్నో, ఢిల్లీలోని వైద్యులను సంప్రదించి లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకుంది. 
 
అనంత‌రం ఆమె తన పేరును శివంగి నుంచి రాణుగా మార్చుకుంది. అటు వారి ప్రేమ‌ను ఇరువురి కుటుంబాలు కూడా అంగీక‌రించాయి. దాంతో ఈ జంట వారి కుటుంబాల ఆశీర్వాదంతో నవంబర్ 25న పెళ్లి చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments