Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని సచిన్ - నటి రేఖ

రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజాప్రతినిధులంతా ఆదివారం రాత్రికే తమతమ నియోజకవర్గాల నుంచి రాజధానులకు చేరుక

Webdunia
సోమవారం, 17 జులై 2017 (15:42 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజాప్రతినిధులంతా ఆదివారం రాత్రికే తమతమ నియోజకవర్గాల నుంచి రాజధానులకు చేరుకున్నారు. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
అయితే, రాజ్యసభ సభ్యులుగా ఉన్న మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి రేఖలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ పోలింగ్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. కానీ రాజ్య‌స‌భ ఎంపీలే అయిన మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, న‌టి రేఖ‌, బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, బాక్స‌ర్ మేరీకోమ్ మాత్రం ఓటు వేయ‌డం లేదు.
 
ఎందుకంటే.. వీరంతా నామినేటెడ్ సభ్యులు. రాష్ట్ర‌ప‌తి వీళ్ల‌ను నామినేట్ చేస్తారు. అందుకే ఆ ప‌ద‌వికి జ‌రిగే ఎన్నిక‌లో ఓటు వేయ‌డానికి వీళ్లు అర్హులు కాదు. వీళ్లే కాదు.. రాజ్య‌స‌భ‌లో మొత్తం 12 మందిని, లోక్‌స‌భ‌లో ఇద్ద‌రు ఆంగ్లో ఇండియ‌న్స్‌ను రాష్ట్ర‌ప‌తి నామినేట్ చేస్తారు. దీంతో ఈ 14 మందికి ఓటు వేసే హ‌క్కు ఉండ‌దు.
 
ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో ఈ న‌లుగురితోపాటు మలయాళ సురేశ్ గోపి, రూపా గంగూలీ, న‌రేంద్ర జాద‌వ్‌, స్వ‌ప‌న్ దాస్‌గుప్తా, కేటీఎస్ తుల‌సి, ప‌రాశ‌ర‌ణ్‌, అను ఆగా, శంభాజీ రాజెల‌ను రాజ్య‌స‌భ‌కు రాష్ట్రపతి నామినేట్ చేశారు. వీళ్లంతా వివిధ రంగాల్లో ప్ర‌ముఖులు. వీరందరూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి సభ్యులందరికీ, కార్మికులకూ మంచి జరగాలి : మాదాలరవి

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments