Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకానికి హెలికాఫ్టర్ : కారు చౌకగా విక్రయం - రూ.26 కోట్లు డిస్కౌంట్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (22:06 IST)
రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.30 కోట్ల విలువ చేసే ప్రభుత్వం హెలికాఫ్టర్‌ను కేవలం నాలుగు కోట్ల రూపాయలకే విక్రయించాలని నిర్ణయించింది. అయినప్పటికీ అత్యంత ఖరీదైన, అన్ని భద్రతా సదుపాయాలున్న ఈ హెలికాప్టర్‌ను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే ఉన్నప్పుడు ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీకి చెందిన ట్విన్ ఇంజిన్ 109 హెలికాప్టర్ ను రూ.30 కోట్లతో కొనుగోలు చేశారు. ఆమె సీఎంగా ఉన్నప్పుడు అధికార కార్యక్రమాలకు ఈ హెలికాప్టర్‌నే అధికంగా వినియోగించేవారు. 
 
అయితే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించేశారు. అప్పటి నుంచి ఈ హెలికాప్టర్‌ను ఎవరూ వినియోగించలేదు. దీంతో అప్పటి నుంచి అది గోడౌన్‌‌లో వృథాగా పడి ఉంది. ఈ నేపథ్యంలో ఆ హెలికాప్టర్‌ను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇప్పటివరకు 12 సార్లు టెండర్లను పిలిచినా కొనేందుకు ఎవరూ రాలేదు. దీంతో ఏకంగా రూ.26 కోట్ల డిస్కౌంట్ ఇస్తూ... కేవలం రూ. 4 కోట్లకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈసారైనా ఎవరైనా కొనేందుకు ముందుకు వస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments