Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు ఫోనులో మూడుసార్లు తలాక్.. మేనకోడలితో పరార్.. పోలీసులకు చిక్కాడు.. ఎలా?

భార్యకు ఫోనులో మూడు సార్లు తలాక్ చెప్పి.. మేనకోడలితో ఓ ప్రబుద్ధుడు పరారైనాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కానీ మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయడంతో సీన్ రివర్సైంది. ఇంకా మేనకోడలితో పార

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (18:43 IST)
భార్యకు ఫోనులో మూడు సార్లు తలాక్ చెప్పి.. మేనకోడలితో ఓ ప్రబుద్ధుడు పరారైనాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కానీ మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయడంతో సీన్ రివర్సైంది. ఇంకా మేనకోడలితో పారిపోయిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. భోపాల్‌కు చెందిన ఫైజాన్ అనే యువకుడు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య మేనకోడలి (14)తో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ భోపాల్‌ నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోవాలని ప్లాన్ చేశారు. పనిలో పనిగా ఫైజాన్ తన భార్య మేనకోడలితో కలసి కాన్పూర్ బయలుదేరాడు.
 
ఈ విషయం తెలియగానే ఫైజాన్ భార్య కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాన్పూర్ వెళ్లేముందే ఫైజాన్ అక్కడ ఉన్న తన స్నేహితుడికి ఫోన్‌ చేసి స్టోరీ మొత్తం చెప్పి, తన పెళ్లికి సహకరించాల్సిందిగా కోరాడు.

తీరా కాన్పూర్ వెళ్లాక స్నేహితుడి ఫోన్ స్విచాఫ్ రావడంతో ఫైజాన్ ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో అనుమానాస్పదంగా కనిపించిన పైజాన్‌, మైనర్ బాలికను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం తెలిసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments