Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం భర్తను చంపేసింది... జైలులో జ్యోతిష్యురాలిగా మారింది...

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (12:09 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసి, సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుని పదవిని కోల్పోయిన కాంగ్రెస్ రాజకీయ నేతలు ఎన్.డి.తివారీ. ఈయన అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఆయన కుమారుడు రోహిత్ తివారీ కూడా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో రోహిత్ తివారీ భార్య అపూర్వ శుక్లా ప్రధాన నిందితురాలని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉంటోంది.
 
ఈమె వద్ద జరిపిన విచారణలో కట్టుకున్న భర్తను ఆస్తి కోసం హత్య చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న అపూర్వ ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను చేసిన నేరం పట్ల ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడంలేదని జైలు సిబ్బంది చెబుతున్నారు. 
 
పైగా ఆమె ప్రస్తుతం జాతకాలు చెప్పడం నేర్చుకుంటుందన్నారు. జైలులో వారానికి రెండుసార్లు మంగళవారం, గురువారం రోజుకు రెండు గంటలపాటు జాతకాల గురించి క్లాసులు జరుగుతుండగా, వాటికి క్రమం తప్పకుండా అపూర్వ హాజరువుతుందని జైలు సిబ్బంది వెల్లడించారు. 
 
పైగా, ఈ కోర్సు పట్ల ప్రత్యక శ్రద్ధ చూపుతోందని ప్రశంసిస్తున్నారు. గతంలో కోర్టు విచారణ సందర్భంగా ఓ క్లాస్ మిస్సయిందని.. అందుకు ఆమె బాధ పడిందని అధికారులు వెల్లడించారు. మొత్తంమ్మీద ఆస్తికోసం భర్తను హత్య చేసిన అపూర్వ... ఇపుడు జ్యోతిష్యురాలిగా మారనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం