Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌లో దారుణం : కడియాల కోసం కాళ్లు నరికేసిన దొంగలు

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (14:32 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో దారుణం జరిగింది. కాళ్లకు వున్న విలువైన కడియాల కోసం దొంగలు ఏకంగా కాళ్లే నరికేశారు. రాజ‌స్థాన్‌లోని రాజ్‌స‌మంద్ జిల్లాలోని చ‌ర్‌భుజా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన కంకుభాయి(45) అనే మ‌హిళ త‌న భ‌ర్త‌కు టిఫిన్ ఇచ్చేందుకు సోమ‌వారం ఉద‌యం వ్య‌వ‌సాయ పొలానికి బ‌య‌ల్దేరింది. అయితే మార్గ‌మ‌ధ్య‌లోనే ఆమెను దొంగ‌లు కిడ్నాప్ చేశారు. 
 
మ‌ధ్యాహ్నం స‌మయానికి కూడా కంకుభాయి పొలం వ‌ద్ద‌కు వెళ్ల‌క‌పోయేస‌రికి భ‌ర్త ఇంటికి వ‌చ్చాడు. అమ్మ ఎక్క‌డా? అని త‌న పిల్ల‌ల‌ను ప్ర‌శ్నించ‌గా.. ఉద‌యాన్నే టిఫిన్ తీసుకొని పొలం వ‌ద్ద‌కు వ‌చ్చింద‌ని చెప్పారు. 
 
కానీ ఆమె పొలం వ‌ద్ద‌కు వెళ్ల‌క‌పోవ‌డంతో.. కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌లిసి వెతికారు. సోమ‌వారం రాత్రి వ‌ర‌కు కూడా ఆమె ఆచూకీ ల‌భించ‌లేదు. దీంతో కంకుభాయి అదృశ్యంపై ఆమె కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
 
ఈ క్రమంలో చ‌ర్‌భుజా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ వ్య‌వ‌సాయ పొలం వ‌ద్ద కంకుభాయి మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కాళ్లు న‌రికివేసిన‌ట్లు నిర్ధారించారు. మెడ‌పై కూడా దాడి చేయ‌డంతో ఆమె మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. 
 
వెండి క‌డియాల కోస‌మే ఆమె కాళ్ల‌ను దొంగ‌లు నరికిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన నిందితుల‌ను త్వ‌ర‌లోనే అరెస్టు చేస్తామ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments