చాట్‌జీపీటీ ఆధారంగా తీర్పులు ఇవ్వలేం : ఢిల్లీ హైకోర్టు

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (11:45 IST)
న్యాయ నిర్ణయం ప్రక్రియలో మానవ జోక్యానికి, కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల చాట్‌జీపీటీ ఆధారంగా తీర్పులు ఇవ్వలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఓ తీర్పు వెలువరించడానికి, వాస్తవాలు తేల్చడానికి చాట్‌జీపీటీని ప్రాతిపదికగా తీసుకోలేమని తేల్చిచెప్పింది. ఇలాంటి చాట్‌బోట్‌ల ఖచ్చితత్వం, వాటిపై ఎంతవరకు ఆధారపడవచ్చనేది ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నందున ప్రాథమిక పరిశోధన/అవగాహన కోసం మాత్రం ఉపయోగించుకోవచ్చని సూచించింది.
 
వ్యాపార చిహ్న నిబంధనలను తమ భాగస్వామ్య సంస్థ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. విలాసవంతమైన చెప్పులు, బూట్లు తయారుచేసే 'క్రిస్చన్‌ లూబటన్‌' దాఖలు చేసిన ఓ కేసులో ఇటీవల జస్టిస్‌ ప్రతిభా ఎం.సింగ్‌ తీర్పు వెలువరించారు. తమ నమోదిత వ్యాపార చిహ్నంపై, దాని ప్రతిష్ఠపై చాట్‌జీపీటీ ఏం చెబుతోందో చూడాలని సంస్థ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. 
 
ప్రశ్న ఏ తీరులో ఉందనే దానిని బట్టి, దానికి అందిన శిక్షణ ఆధారంగా చాట్‌బోట్‌లు సమాధానాలు ఇస్తుంటాయని, అవి తప్పు అయ్యే అవకాశాలూ లేకపోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉద్దేశ పూర్వకంగానే ప్రతివాది.. పిటిషనర్‌ ఉత్పత్తులను కాపీ కొట్టారని, ఆ బ్రాండ్‌ పేరును వాడుకొని డబ్బు సంపాదించాలనే ఈ చర్యకు పాల్పడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపింది. 
 
పిటిషనర్‌ బూట్ల డిజైన్లను, రంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీ చేయరాదని ప్రతివాదిని ఆదేశించింది. ఈ మేరకు పిటిషనర్‌తో ఒప్పందం చేసుకోవాలని చెప్పింది. దానిని అతిక్రమిస్తే రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుత పిటిషన్‌ ఖర్చుల కింద ఫిర్యాదిదారుకు రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments