Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణుకా చౌదరి.. మొక్కజొన్నలు అమ్మారు... రైతన్నల కోసం..?

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని, రేణుకా చౌదరి నవ్వును మోద

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (13:42 IST)
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని, రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడంతో.. ఆ నవ్వు రామాయణంలో ఎవరిదబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. తాజాగా రేణుకా చౌదరి వార్తల్లోకెక్కారు.
 
ఈసారి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మొక్కజొన్న కంకులు అమ్మారు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు అమ్మి రూ.5లక్షలు సేకరించారు. చేసిన అప్పులు తీర్చలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాల కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రేణుకా చౌదరి మొక్కజొన్నలను అమ్మారు. 
 
రేణుకా చౌదరి మొక్కజొన్న కంకులు కొన్నాక.. ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు రూ.60వేలిచ్చారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ రూ.50 వేలు ఇచ్చారు. ఇలా పలువురు కాంగ్రెస్ నేతలు అందించిన నగదును రైతుల కుటుంబాలకు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments