Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుపిఎస్‌సి పరీక్షా క్యాలెండర్‌ విడుదల

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (13:22 IST)
2021-22లో జరగబోయే పరీక్షల తేదీలను రీ షెడ్యూల్‌ చేస్తూ తాజా క్యాలెండర్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) శనివారం విడుదల చేసింది.

ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ పరీక్ష రీషెడ్యూల్‌ తేదీ ప్రకారం సెప్టెంబర్‌ 5న నిర్వహించనుంది. సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) పరీక్షలు ఆగస్టు 8న, ఎన్‌డిఎ -2 పరీక్ష నవంబర్‌ 14న జరగనుంది.

యుపిఎస్‌సి సివిల్‌ సర్వీస్‌ (ప్రిలిమ్స్‌) ఫారెస్ట్‌ సర్వీస్‌ (ప్రిలిమ్స్‌) పరీక్షలను జూన్‌ 27న నిర్వహిస్తామని పేర్కొనగా... తాజాగా సవరించిన క్యాలెండర్‌లో అక్టోబర్‌ 10న నిర్వహించనుంది. సివిల్‌ సర్వీస్‌ మెయిన్స్‌ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీ నుండి ప్రారంభమవుతాయి.

ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుండి ప్రారంభమై...10 రోజుల పాటు అంటే మార్చి 8 వరకు జరగనున్నాయి. 2020లో నిర్వహించవలసిన పలు పరీక్షలు పెండింగ్‌లో ఉన్నాయి.

2020 బ్యాచ్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలు ఈఏడాది ఆగస్టు నుండి సెప్టెంబర్‌ వరకు నిర్వహించాల్సి ఉంది. ఈ పునరుద్ధరించిన క్యాలెండర్‌ కోసం https://www.upsc.gov.in/చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments