భగత్ సింగ్ నాటకం కోసం రిహార్సల్ : ఉరి బిగించుకుని బాలుడి మృతి

Webdunia
శనివారం, 31 జులై 2021 (15:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భగత్ సింగ్ నాటకం కోసం రిహాల్స్ చేస్తుండగా జరిగిన అపశృతి కారణంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భ‌గ‌త్ సింగ్ నాట‌కం ప్ర‌ద‌ర్శించేందుకు యూపీలోని బ‌దౌన్ జిల్లా బ‌బ‌త్ గ్రామంలో కొందరు విద్యార్థులంతా కలిసి రిహార్సల్ చేపట్టారు. భూరే సింగ్ కుమారుడైన శివ‌రామ్ ఇత‌ర పిల్ల‌ల‌తో క‌లిసి రిహార్స‌ల్స్ చేస్తూ భ‌గ‌త్ సింగ్ ఉరితీత సీన్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు శివం త‌న మెడ‌చుట్టూ ఉచ్చు బిగించుకున్నాడు.
 
తాను నిలుచున్న స్టూల్ ప‌డిపోవ‌డంతో ఉరిబిగుసుకుని బాలుడు మ‌ర‌ణించాడని స్ధానికులు తెలిపారు. దీంతో భ‌యానికి గురైన పిల్ల‌లు సాయం కోసం కేక‌లు వేయ‌గా అక్క‌డికి చేరుకున్న స్ధానికులు శివంను కింద‌కు దింపి ఉచ్చును తొల‌గించ‌గా బాలుడు అప్ప‌టికే మ‌ర‌ణించాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని జిల్లా ఎస్పీ సంక‌ల్స్ శ‌ర్మ వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments