Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజువయ్యా.. మహారాజువయ్యా... పని మనిషికి.. పెంపుడు శునకానికి వాటా రాసిన రతన్ టాటా!!

ఠాగూర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (21:33 IST)
భారత పారిశ్రామికదిగ్గజం రతన్ టాటా ఇటీవల భౌతికంగా దూరమయ్యారు. కానీ, ఆయన దేశానికి సేవలు మాత్రం దేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. ఇపుడు ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన జీవించివున్నపుడు రాసిన వీలునామా ఒకటి వెలుగులోకి వచ్చింది. తమ ఇంట్లో పని చేసే పనిమనిషితో పాటు.. తన పెంపుడు శునకానికి కూడా టాటా ఆస్తుల్లో వాటా రాసిన మహోన్నత మానవతామూర్తిగా, జంతు ప్రేమికుడిగా చరిత్రలో మిగిలిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయాన్ని పరిశీలిస్తే, 
 
రతన్ టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు శునకం టిటో జీవితకాల సంరక్షణ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని రాశారు. ఆ బాధ్యతలను తన వద్ద ఎంతోకాలంగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షాకు అప్పగించినట్టు సదరు వీలునామా చెబుతుంది. రతన్ టాటా గతంలో టిటో అనే శునకాన్ని పెంచుకున్నారు. అది మరణించిన తర్వాత మరో శునకాన్ని దత్తత తీసుకుని దానికి కూడా టిటో అనే పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటూ వచ్చారు. 
 
అలాగే, మూడు దశాబ్దాలుగా తన వద్ద పనిచేస్తూ తోడుగా ఉన్న వ్యక్తిగత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య పేర్లను కూడా తన వీలునామాలో చేర్చారు. టాటాకు ఉన్న దాదాపు పది వేల కోట్ల ఆస్తుల్లో ఆయన నెలకొల్పిన ఫౌండేషన్‌లకు, సోదరుడు జిమ్మీ టాటాకు, సోదరీమణులకు, తన సహాయకులు, ఇతరులకు చెందుతాయని వీలునానాలో రాసినట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాల్లోకి రమ్మంటారా? హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్..

క సినిమాతో కొత్త ప్రపంచాన్ని చూస్తారు : కథానాయకుడు కిరణ్ అబ్బవరం

పోలీస్ ఆఫీసర్, డాక్టర్ మధ్య ప్రేమకథతో శ్రీమురళి, రుక్మిణి వసంత్ ల బఘీర

చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో జాతర చిత్రం నవంబర్ లో విడుదల

మితిమీరిన ప్రేమ ఎంత భయంకరమో చెప్పే కథే శారీ : రామ్ గోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

15 రోజులకు ఒక్కసారైనా మహిళలు పైనాపిల్ తీసుకోవాలట

బాదం పప్పుల మంచితనంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి

చింతకాయలు వచ్చేసాయి, ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

వాష్ బేసిన్ తళతళ మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments