Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు.. కంటతడి పెట్టించే దృశ్యం (Video)

ఠాగూర్
గురువారం, 10 అక్టోబరు 2024 (18:10 IST)
భారతదేశ వ్యాపార, పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేసిన ప్రముఖుల్లో ఇండియా ఇండస్ట్రియల్ ఐకాన్ రతన్ టాటా ఒకరు. ఆయన అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో యావత్ దేశం విచారంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛలనాతో ముగిశాయి. మహారాష్ట్ర పోలీసులు తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు. 
 
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ హాజరయ్యారు. అలాగే, భారీ సంఖ్యలో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు రతన్ టాటాకు చివరిసారి నివాళులు అర్పించారు. ముంబైలోని ఎన్సీపీఏ నుంచి వర్మి శ్మశానవాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో ముంబై నగర వాసులు, టాటా గ్రూపు కంపెనీల ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, రతన్ టాటా పెంపుడు శునకం శవపేటిక వద్దకు చేరుకుని అక్కడే ఉండిపోయింది. రతన్ టాటా భౌతికకాయం వద్ద దీనంగా విలపిస్తూ ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్మీ రాయ్ మూవీ ఝాన్సీ ఐపీఎస్ తెలుగు రైట్స్ దక్కించుకున్న డాక్టర్ ఆర్కే గౌడ్

ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో మూవీ టైటిల్ మహాకాళి

తిరువీర్ హీరోగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంఛ‌నంగా ప్రారంభం

మాడ్రిడ్ లో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంపార్టెంట్ షూటింగ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?

హెచ్-ఎం కొత్త పండుగ కలెక్షన్: వేడుకల స్ఫూర్తితో సందర్భోచిత దుస్తులు

ఎన్ఆర్ఐల కోసం ఏఐ-ఆధారిత రిమోట్ పేరెంట్ హెల్త్ మానిటరింగ్ సర్వీస్ డోజీ శ్రవణ్

ఎలాంటి కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది?

ఈ 5 పాటిస్తే జీవితం ఆనందమయం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments