Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి మరువలేనిది.. రన్‌ ఫర్‌ యూనిటీని ప్రారంభించిన మోదీ

నవభారత నిర్మాణంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి మరవలేనిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలో ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (08:45 IST)
నవభారత నిర్మాణంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి మరవలేనిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలో ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానంతరం పటేల్‌ దేశాన్ని ఒక్కటి చేశారని అన్నారు. ఎందరో కుట్రలను చేధించి సామ, దాన, భేద, దండోపాయంతో దేశాన్ని సంఘటితం చేసిన వ్యక్తి పటేల్‌ అని ప్రశంసించారు. 
 
ఇక లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం మనదేశానికి ఉన్న ప్రత్యేకతలని మోదీ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, పటేల్‌ ఆశయాలను వారే ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.  
 
మరోవైపు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహం వద్ద రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments