Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు ఆకాశంలో అద్భుత దృశ్యం - కనువిందు చేయనున్న తోకచుక్క

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (10:52 IST)
ఈ నెల రెండో తేదీన ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతంకానుంది. అదీ కూడా 50 యేళ్ల తర్వాత గ్రీన్ కామెట్ అనే తోక చుక్క మళ్లీ కనువిందు చేయనుంది. ఇది గతంలో 50 యేళ్లక్రితం కనిపించినట్టు అంతరిక్ష పరిశోధకులు చెపుతున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇది ఆకాశంలో కనిపించనుంది. 
 
ఈ నెల రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకు కనిపించనున్న ఈ తోకచుక్కను విజయవాడవాసులు మరింత స్పష్టంగా చూడొచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో ఇది కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ 'గ్రీన్ కామెట్‌'కు శాస్త్రవేత్తలు సీ/2022 ఈ3 (జడ్‌టీఎఫ్)గా నామకరణం చేశారు.
 
అయితే, ఈ తోకచుక్క బుధవారం భూమికి 42 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. దీన్ని ఇపుడు చూడలేకపోతే ఇక జీవితంలో ఎన్నడూ చూడలేరని తెలిపింది. 
 
ఎందుకంటే ఇది మళ్లీ కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాతే కనిపిస్తుందని పేర్కొంది. ఇది బృహస్పతి కక్ష్యలో ఉండగా గతేడాది మార్చిలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి నుంచి అది వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.  
 
తోకచుక్కలు అంటే మరేంటో కావని, వాయువులతో నిండిన అంతరిక్ష మంచు గోళాలేనని ముంబైలోని అక్షయ గంగ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ సభ్యుడు అమృతాన్షు వాజపేయి తెలిపారు. ఇవి దాదాపు ఒక నగరం అంత వ్యాసంతో ఉంటాయని, సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి ధూళిని, వాయువులను అమితమైన వెలుగుతో బయటకు వెదజల్లుతాయన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments