Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు భారతీయులకు రామన్ మెగాసెసే అవార్డు

ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది. ప్రకృతి, సంస్కృతి, విద్యలతో సామాజిక పురోగతి సాధ్యమని సోనమ్ వాంగ్‌చుక్, సమాజం చిన్నచూపు చూసిన వారికి ఆరోగ్యంతో పాటు గౌరవాన్ని కూడా కల్పి

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (08:49 IST)
ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది. ప్రకృతి, సంస్కృతి, విద్యలతో సామాజిక పురోగతి సాధ్యమని సోనమ్ వాంగ్‌చుక్, సమాజం చిన్నచూపు చూసిన వారికి ఆరోగ్యంతో పాటు గౌరవాన్ని కూడా కల్పించేందుకు కృషి చేసిన డాక్టర్ భరత్ వత్వానీలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.
 
అలాగే, ఇతర దేశాలకు చెందిన మరో నలుగురిని ఈ అవార్డు వరించింది. ఆగస్టు 31వ తేదీన అవార్డులను వీరికి అందజేస్తారు. 1988లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సోను వాంగ్‌చుక్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడాక్ స్థాపించారు. ఆ ప్రాంతంలోని విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. 
 
1994లో ఆపరేషన్ న్యూ హోప్ అనే ప్రాజెక్టును ప్రారంభించి 700 మంది ఉపాధ్యాయలకు, 1000 వీఈసీ లీడర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. దీంతో 1996లో ప్రభుత్వ స్కూళ్లలో ఐదు శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతాన్ని 2015 నాటికి 75 శాతానికి పెంచారు. 
 
అలాగే, డాక్టర్ భరత్ వత్వానీ తన భార్యతో కలిసి 1988లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్ ప్రారంభించారు. వీధుల్లో తిరిగే మానసిక వ్యాధిగ్రస్తులను చేరదీసి ఉచిత వసతి, చికిత్స అందించి తిరిగి వాళ్లను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. వీరి సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments