Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెస్టుకు ముందే అమ్మాయిలు.. డబ్బు పంపిణీ .. డేరాబాబా కేసులో ట్విస్ట్

ఆశ్రమానికి వచ్చిన ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేసిన కేసులో డేరా బాబాకు పంచకుల కోర్టు జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (16:46 IST)
ఆశ్రమానికి వచ్చిన ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేసిన కేసులో డేరా బాబాకు పంచకుల కోర్టు జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. 
 
డేరాబాబాకి అండగా నిలిచిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు వెల్లడిస్తూ... అజ్ఞాత వ్యక్తి ఒకరు పంజాబ్-హర్యానా హైకోర్టుకు లేఖరాశాడు. గతేడాది ఆగస్టు 26న పంచకుల కోర్టు డేరాబాబాను దోషిగా నిర్ధారించిన తర్వాత ఏం జరిగిందీ... డేరా హెడ్‌క్వార్టర్స్ నుంచి అక్రమ ఆయుధాలు, డబ్బు, ఇతర సామాగ్రిని ఎలా తరలించిందీ అందులో వివరించాడు. 
 
ముఖ్యంగా, డేరా బాబా అరెస్టుకు ముందే పోలీసులకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పడమే కాకుండా, అమ్మాయిలను కూడా సరఫరా చేసినట్టు పేర్కొన్నాడు. అలాగే, అక్రమాయుధాలు, డబ్బు సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం డేరా నిర్వాహకులు హర్యానా సీఐడీ చీఫ్ అనిల్ రావు, డీఎస్పీ అజిత్ సింగ్‌లకు భారీ మొత్తంలో లంచమిచ్చినట్టు అందులో పేర్కొన్నాడు. ఈ ఇద్దరు పోలీసు అధికారులు దాదాపు 65 కంప్యూటర్లకు సంబంధించిన హార్డ్ డిస్కులను ఎలాంటి డేటా దొరక్కుండా ధ్వంసం చేసినట్టు వెల్లడించాడు.
 
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి రవీందర్ సింగ్ ధూల్‌ని ఉద్దేశిస్తూ అతడు ఈ లేఖ రాశాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తి రాసిన ఈ లేఖపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీని కాపీలను అమికస్ క్యూరీ అనుపమ్ గుప్తాకు అందచేసింది. తాజా లేఖలో అజ్ఞాతవ్యక్తి చేసిన ఆరోణలతో హర్యానా పోలీసు అధికారుల్లో మళ్లీ గుబులు రేగుతోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments