Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు క్రిస్మస్‌ పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రి నర

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (13:35 IST)
Merry Christmas
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు క్రిస్మస్‌ పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రిస్మస్‌ సమాజంలో  సుఖశాంతులు తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు వెల్లడించారు.
 
అలాగే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెదక్ చర్చిలో ఉదయం నుంచే ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమైనాయి. చర్చిలో ప్రార్థనలకు క్రిస్టియన్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని చర్చిల్లో అర్థరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ గీతాలు అలరిస్తున్నాయి.
 
చర్చిల ముందు క్రిస్మస్ చెట్లు కూడా క్రిస్టియన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక.. నగరంలోని సికింద్రాబాద్‌లో ఉన్న పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని దానవాయిగూడెంలోని చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments