Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుణ్య మరణానికి అనుమతివ్వండి : హైకోర్టును వేడుకున్న నళిని

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (15:19 IST)
మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలులో ఉంటున్న ముద్దాయిలైన నళిని, ఆమె భర్త మురుగన్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఈ మేరకు వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఇదే అంశంపై వారిద్దరూ గత నెల 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్‌కి నళిని లేఖ రాశారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే నళిని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తరపు లాయర్ పుగళేంది పేర్కొన్నారు. 
 
జైలు అధికారుల సాయంతో ప్రధాని మోడికి నళిని లేఖ రాశారని ఆయన తెలిపారు. 'మేము విడుదలవుతామని గత 26 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాం. ఇప్పుడు ఆ ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. జైలు అధికారులు నా భర్త మురుగన్‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. వారు నా భర్తను పెడుతున్న బాధలు చూడలేకపోతున్నాను. అందువల్ల మా కారుణ్య మరణానికి అనుమతించండి' అని ప్రధాని మోడీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది.
 
కాగా, రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన వారిందరికీ ఉరిశిక్షలు పడ్డాయి. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబ సభ్యులు వారిని క్షమించడంతో వారి ఉరిశిక్షలను యావజ్జీవ కారాగారశిక్షలుగా మార్చేశారు. ఈ శిక్షాకాలం కూడా ఎపుడో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న మొత్తం ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ముందు పెండింగ్‌లో ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments