Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ హత్య కేసు : ముద్దాయికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (14:59 IST)
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన పెరారివాలన్‌కు సుప్రీంకోర్టు వారం రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఆరోగ్య పరీక్షల నిమిత్తం పెరోల్‌ను ఇచ్చింది. పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లేసమయంలో పెరారివాలన్‌కు పూర్తి భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 
 
నవంబర్ 23 వరకు ఆయనకు మద్రాస్ హైకోర్టు పెరోల్ మంజూరు చేయగా, దాన్ని సుప్రీంకోర్టు వారం రోజుల పాటు పొడగించింది. పెరారివాలన్‌కు పెరోల్ ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో, ఆయన పెరోల్‌ను సుప్రీం పొడిగించింది. 
 
మరోవైపు ఈ హత్య కేసులో దోషులైన ఏడుగురిని విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసు ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న విషయం తెల్సిందే. రానున్న జనవరిలో వీరి విడుదలపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ అంశానికి సంబంధించి తమిళనాడు గవర్నర్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది.
 
వీరి విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ ఈ నెల ప్రారంభంలో తమిళనాడులోని విపక్ష పార్టీలైన డీఎంకే, పీఎంకే లు రాష్ట్ర గవర్నర్‌ను కోరాయి. రెండేళ్లుగా ప్రభుత్వ సిఫారసు గవర్నర్ వద్ద పెండింగులో ఉంది. ఇంత వరకు ఆయన ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏడుగురు దోషులు గత 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments