Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్‌కు ఇంగ్లీష్ రాదు.. సీఎంగా పనికిరాడు : సుబ్రమణ్య స్వామి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు విమర్శలు చేశారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు వస్తున్న వార్తలపై స్వామ

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (16:11 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు విమర్శలు చేశారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు వస్తున్న వార్తలపై స్వామి గత కొంతకాలంగా ట్వీట్లు చేస్తున్న విషయం తెల్సిందే.
 
ఇప్పటికే రజనీ రాజకీయ రంగ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్వామి.. శుక్రవారం మరోమారు విమర్శలు గుప్పించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు పనికిరారని చెప్పారు. విద్యాధికులైన తమిళ ప్రజలు, అంతగా చదువుకోని రజనీకాంత్‌ని సీఎంగా చూడలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రస్తుత రాజకీయాల్లో చదువుకున్న వాళ్లే ఉండగలరన్నారు. రజనీకాంత్‌తో బీజేపీ పొత్తుపెట్టుకుంటే తాను వ్యతిరేకిస్తానని అన్నారు. అయినప్పటికీ ఆయనతో పొత్తు కొనసాగిస్తే, పార్టీ అధిష్టానం ఇష్టమని స్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో చేసిన ట్వీట్‌లో రజనీ కర్నాటకలో పుట్టి.. మహారాష్ట్రలో పెరిగారని, అందువల్ల ఆయన బేసిగ్గా తమిళుడు కాదంటూ పేర్కొన్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments