Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడుకు 'అచ్చే దిన్' రాలేదు... కాషాయ రంగు రజనీకి సూటవుతుంది...

విశ్వనటుడు కమల్ హాసన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు ఇంకా అచ్చే దిన్ రాలేదన్నారు. అలాగే, ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (13:18 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు ఇంకా అచ్చే దిన్ రాలేదన్నారు. అలాగే, ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపోతే, తన వంటికి కాషాయపు రంగు సూట్ కాదానీ, ఆ రంగు సూపర్ స్టార్ రజినీకాంత్‌కు సూటవుతుందని అభిప్రాయపడ్డారు. 
 
తాజా రాజకీయ పరిణామాలపై కమల్ హాసన్ ఎన్డీటీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీకి తన కంటే రజనీకాంతే సూటవుతాడని, తాను హేతువాదినని స్పష్టంచేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తమిళనాడుకు ఇంకా అచ్చే దిన్ రాలేదు. మిగతా రాష్ట్రాలతో నాకు సంబంధం లేదు కానీ.. అచ్చే దిన్ ఎప్పుడొస్తాయి అని కమల్ ప్రశ్నించారు. 
 
ప్రస్తుతం నార్త్, సౌత్ మధ్య ఖచ్చితంగా ఓ విభజన రేఖ కనిపిస్తున్నది. ఢిల్లీకి తమిళనాడు అర్థం కాదు. అలాగే తమిళనాడుకు ఢిల్లీ అర్థం కాదు. ఏ సైడ్ నుంచి కాస్త సానుకూల పరిణామం కనిపించినా.. అవతలి సైడ్ దానిని అనుమానిస్తుంది. అందుకే ఇప్పటివరకు ఏ జాతీయ పార్టీ తమిళనాడులో పాగా వేయలేదు అని కమల్ అభిప్రాయపడ్డాడు. 
 
ఇక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మరో సూపర్‌స్టార్ రజినీకాంత్ విషయంలోనూ కమల్ స్పందించాడు. అంశాల వారీగా అతనితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రజినీతో మాట్లాడుతూనే ఉంటా. అతను నాకు స్నేహితుడు. రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడు ముందు అతనికే చెప్పాను. తమిళనాడు గతంలో ఎన్నడూ లేనంత గడ్డు స్థితిలో ఉందని, అందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కమల్ స్పష్టంచేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments