Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠకు తెరదింపిన రజినీకాంత్ - 30న కీలక భేటీ

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (13:57 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సొంతంగా పోటీ చేస్తారా? లేకా బీజేపీకి మద్దతిస్తారా అనే అంశంపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదించేలా రజినీకాంత్ కీలక ప్రకటన చేశారు. 
 
త‌న అభిమాన సంఘానికి చెందిన అధ్యక్షుల‌ందరూ న‌వంబ‌ర్ 30న చెన్నైకు రావాలని రజనీకాంత్ పిలుపునిచ్చారు. సోమవారం ఉద‌యం 9 గంట‌ల‌కు వారితో సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే, ఈ సమావేశం ఎందుకు పెడుతున్నార‌న్న విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆయన కీలక చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది. 
 
కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఈ విషయంలో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఒక అడుగు ముందుంది. అదేసమయంలో తన మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని పక్కనపెట్టాలని డీఎంకే భావిస్తోంది. అలాగే, అధికార అన్నాడీఎంకే కూడా తనదైనశైలిలో వ్యూహాలు రచించుకుంటూ ముందుకుసాగుతోంది. ఈ ఎన్నికల కోసం బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments