పడక సుఖానికి అడ్డుగా ఉందనీ.. ప్రియుడితో కలిసి నాలుగేళ్ళ కుమార్తె హత్య...

Webdunia
సోమవారం, 17 మే 2021 (18:26 IST)
పడక సుఖానికి అడ్డుగా ఉందనీ భావించిన ఓ తల్లి.. తన ప్రియుడితో కలిసి నాలుగేళ్ళ కుమార్తెను మట్టుబెట్టింది. ఈ దారుణ హత్య రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తన భార్య టీనా (25), నాలుగేళ్ల కుమార్తె నందిని కనిపించడం లేదంటూ గతేడాది డిసెంబరు 16న కోటా జిల్లాలోని బోర్ఖెరా గ్రామానికి చెందిన సుమిత్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
కేసు నమోదు చేసుకుని టీనా కోసం గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు టీనా ఆచూకీ లభ్యమైంది. జైపూర్ జిల్లాలోని ఉడావాలా గ్రామంలో ఆమె ఉన్నట్టు ఈ నెల 13న పోలీసులు గుర్తించారు. అక్కడికెళ్లి చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అక్కడామె తన ప్రియుడు ప్రహ్లాద్ సహాయ్ (45)తో కలిసి జీవిస్తోంది.
 
టీనాను అదుపులోకి తీసుకున్న పోలీసులు నందిని గురించి ప్రశ్నించారు. కుమార్తె తన తల్లిదండ్రుల వద్ద ఉందని చెప్పి పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులు నిలదీయడంతో ఆ తర్వాత నిజాన్ని అంగీకరించింది. 
 
తన ప్రియుడు ప్రహ్లాద్‌తో కలిపి నందినిని చంపేసి అల్వార్‌లోని సరిస్కా అడవిలో పడేసినట్టు చెప్పింది. నందిని తన ప్రియుడితో కలిసి శాలువాతో గొంతు బిగించి చంపేసినట్టు చెప్పారు. ఈ కేసులో నిందితులిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments