Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ మహిళ కళ్ళను ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్డుతో పెకలించి..

క్షుద్రపూజలు చేస్తుందన్న నెపంతో రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి... ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్డుతో ఆమె కళ్లు పెకలించి, ఆమెతో మలం తినిపించి.. ఆపై కొట్టిచంపారు. ఈ ఘటన ఈనెల 2వ తేదీన జరుగగ

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (14:33 IST)
క్షుద్రపూజలు చేస్తుందన్న నెపంతో రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి... ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్డుతో ఆమె కళ్లు పెకలించి, ఆమెతో మలం తినిపించి.. ఆపై కొట్టిచంపారు. ఈ ఘటన ఈనెల 2వ తేదీన జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
జైపూర్‌కు 135 కిలోమీటర్ల దూరంలోని కేక్రీ అనే గ్రామం ఉంది. ఇక్కడ కన్యాదేవి రాయ్‌గర్ అనే మహిళపై చేతబడులు, క్షుద్రపూజలు చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మహిళ చేసే చేష్టలతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఆమెను కొట్టి చంపాలని నిర్ణయించారు.
 
గత నెలలోనే భర్తను కోల్పోయిన ఈ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో బంధువులంతా వెళ్లి ఆమెు తీవ్రంగా కొట్టి, చిత్రహింసలు పెట్టి, ఆమెతో మలం తినిపించి, ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్డుతో నేత్రాలు పెకలించి చంపేశారు.
 
దీనిపై 15 యేళ్ల మైనర్ బాలుడైన ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసులో ఆమె బంధువులు పింకీ, సోనియా, మహావీర్, చంద్ర ప్రకాష్ రాయ్‌గర్‌లపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు అజ్మీర్ ఎస్పీ రాజేంద్ర సింగ్ వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments