Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీర్చలేదని కేసు.. కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 22 మే 2019 (14:46 IST)
మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు తీర్చలేక పోవడంతో బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. దీంతో అవమానభారంతో కుంగిపోయిన ఆ రైతు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హనుమాన్‌గఢ్‌కు చెందిన సురజరామ్(52) అనే రైతు స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.6.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ అప్పుతో పంట వేసినప్పటికీ గిట్టుబాటు కాలేదు. మరోవైపు రెండేళ్లలో ఈ అప్పును తీర్చలేకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9 లక్షలకు చేరుకుంది. ఈ అప్పును తిరిగి చెల్లించలేక పోయాడు.
 
దీంతో అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ రైతు నుంచి స్పందనలేదు. దీంతో బ్యాంకు అధికారులు పోలీస్ స్టేషనులో కేసు పెట్టారు. ఫలితంగా పోలీసులు ఆ రైతును అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత బెయిలుపై విడుదలైన సురజరామ్.. అవమానభారంతో కుంగిపోయి సోమవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments