Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆందోళనకు దిగిన పుల్వామా అమరుల భార్యలు అరెస్టు!

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (16:13 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 40 మంది జవాన్ల కుటుంబాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యావత్ దేశం ఉలికిపాటుకు గురైంది. అయితే, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పలు ప్రభుత్వాన్ని ఢంకా బజాయిస్తూ ప్రకటనలు గుప్పించాయి. ఈ దాడి ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయింది. 
 
ఈ క్రమంలో తమకు న్యాయం జరగలేదని రాజస్థాన్‌లో అమరుల భార్యలు ఆరోపిస్తూ రోడ్డెక్కారు. పుల్వామా బాంబు పేలుడులో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. వీరిని ఆదుకుంటామని రాజస్థాన్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీ నుంచి తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సచిన్ పైలెట్ అమరవీరుల భార్యలతో స్వయంగా మాట్లాడి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారు ఏమాత్రం వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వారిపట్ల దురుసుగా ప్రవర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. పోలీసుల తీరుపై మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments