Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ అమ్మా... అమ్మాయిని వేధించిన కొడుకులను ఖాకీలకు పట్టించిన తల్లి.. ఎక్కడ?

సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పులను తల్లిదండ్రులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తారు. పైగా, తమ బిడ్డ అలాంటివాడంటూ గుడ్‌విల్ సర్టిఫికేట్ కూడా ఇస్తుంటారు. కానీ, ఈ తల్లి మాత్రం.. ఓ అమ్మాయిని వేధించిన

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (10:28 IST)
సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పులను తల్లిదండ్రులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తారు. పైగా, తమ బిడ్డ అలాంటివాడంటూ గుడ్‌విల్ సర్టిఫికేట్ కూడా ఇస్తుంటారు. కానీ, ఈ తల్లి మాత్రం.. ఓ అమ్మాయిని వేధించిన తన ఇద్దరు కుమారులను పోలీసులకు పట్టించి... తప్పు చేసిన పిల్లలకు అండగా నిలిచే తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచింది. రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలన పరిశీలిస్తే... 
 
రాజస్థాన్‌లోని శిప్రాపథ్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ఓ మహిళకు చెందిన అపూర్వ్, విశాల్ అనే ఇద్దరు కుమారులు ఇటీవల ఓ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె హాస్టల్ దగ్గర కిడ్నాప్ చేశారు. ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. పెళ్లి చేసుకునేందుకు తీసుకువెళుతున్నామని బెదిరించారు. దీంతో ఆ యువతి తనకు వివాహం నిశ్చయమైందని చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా, కారులోనే ఆ యువతిని చితకబాదారు. 
 
దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేసింది. ఈ కేకలు బయటకు వినిపించకుండా ఉండేందుకు కారులో మ్యూజిక్ సౌండ్ మరింతగా పెంచి, కారు వేగాన్ని కూడా పెంచారు. అయినా బాధితురాలు కారు నుంచి దూకేసి పారిపోయింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో విషయం తెలుసుకున్న ఇద్దరు కుమారుల తల్లి వారిని పోలీసులకు పట్టించింది. కొడుకులు చేసిన తప్పుపై నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments