Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు ఇద్దరు భార్యలను సమానంగా పంచిన కోర్టు : ఆదివారం భర్త ఇష్టమంటూ తీర్పు...

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (09:06 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇద్దరు భార్య ముద్దుల మొగుడు సమస్యను సునాయాసంగా పరిష్కరించింది. తన ఇద్దరు భార్యలతో సుఖసంతోషాలతో సంసారం చేసేందుకు వీలుగా తీర్పునిచ్చింది. వారంలో ఏడు రోజుల్లో ఆరు రోజులను ఇద్దరు భార్యలతో సమానంగా అంటే ఒక్కో భార్యతో మూడు రోజులు ఉండాలని ఆదేశించింది. ఆదివారం మాత్రం భర్త ఇష్ట ప్రకారం ఏ భార్యవద్ద అయినా ఉండొచ్చని తీర్పునిచ్చింది. ఈ తీర్పునకు ఇద్దరు భార్యలిద్దరు కూడా అంగీకరించారు. 
 
గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి హర్యానాలోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు 2018లో గ్వాలియర్‌కు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో భార్యను అతడు పుట్టింటికి పంపించాడు. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ అతడు తన భార్యను పట్టించుకోలేదు. పైగా, హర్యానాకు వెళ్లిపోయాడు. అక్కడ తన సహోద్యోగి అయిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. 
 
అయితే, తన భర్త వస్తాడని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన మొదటి భార్యకు నిరాశ ఎదురైంది. దీంతో ఆమె భర్త ఉండే హర్యానాకు వెళ్లింది. అక్కడ మరో మహిళతో కాపురం చేస్తుండటంతో విస్తుబోయిన ఆ మహిళ.. గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు.. వారికి ఆరు నెలల పాటు కౌన్సెలింగ్ ఇచ్చింది. చివరకు ముగ్గురితో కలిసి చర్చలు జరిపిన తర్వాత భార్యలిద్దరూ అతడితో కలిసి ఉండేందుకు సమ్మతించారు. 
 
దీంతో ఇద్దరు భార్యలకు కోర్టు సమానంగా విభజన చేసింది. వారంలో మూడు రోజుల ఒక భార్య వద్ద, మరో మూడు రోజులు మరో భార్య వద్ద ఉండాలని, ఆదివారం భర్తకు ఇష్టమైన చోట ఉండొచ్చని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన భర్త.. తన ఇద్దరు భార్యలతో కలిసి ఉండేందుకు వీలుగా భార్యల పేరుపై చెరొక ఇంటిని కొనుగోలు చేసి ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments