Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్డు కౌన్సిలర్ నీచపు పని-మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి..?

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (21:01 IST)
మహిళలపై వేధింపులు ఏమాత్రం తగ్గట్లేదు. నేరాలకు పాల్పడే వారిలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని బర్మర్‌లో ఓ వార్డు కౌన్సిలర్ నీచపు పనికి పాల్పడ్డాడు. బాత్‌రూమ్‌లో ఓ మహిళ స్నానం చేస్తున్న వీడియోలు తీసి.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదేవిధంగా తన స్నేహితుడితో గడపాల్సిందిగా ఆమె ఒత్తిడి తెచ్చాడు. నిందితుడిని కాంతిలాల్‌గా గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బాల్‌తోరా బాధిత మహిళకు నాలుగేళ్ల కిందట పెళ్లైంది. వార్డు నెంబర్ 16కు చెందిన బీజేపీ కౌన్సిలర్ అయిన కాంతిలాల్ తరుచూ మహిళ ఇంటికి వస్తూ వెళ్లేవాడు. అయితే ఈ క్రమంలోనే బాధిత మహిళ స్నానం చేస్తున్న దృశ్యాలను కాంతిలాల్ ఆమెకు తెలియకుండా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. అనంతరం ఆమెను రేప్ చేశాడు.
 
బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి మహిళలపై లైంగిక దాడి చేసిన తరువాత కూడా అతడి పైశాచిక ఆనందం తీరలేదు. తన స్నేహితుడైన పాయ్లాకు చెందిన జోద్‌రామ్‌ కూడా గడపాల్సిందిగా కాంతిలాల్ మహిళపై ఒత్తిడి తెచ్చాడు. లేకుంటే వీడియా వైరల్ చేశాడు. ఈ క్రమంలో జోధ్‌రామ్ కూడా బాధిత మహిళపై అత్యచారానికి పాల్పడ్డాడు. ఇలా వీడియోల పేరు చెప్పి కాంతిలాల్ చాలా సార్లు మహిళను రేప్ చేశాడు. 
 
ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. బాధితురాలి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం