Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠాణాలో ఫాస్టర్‌ను చితకబాదిన స్థానికులు...

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఫాస్టర్‌ను కొంతమంది స్థానికులు చితకబాదారు. బలవంతపు మతమార్పిడులు చేయిస్తున్న కారణంతో ఆ ఫాస్టర్‌పై పోలీస్ స్టేషన్‌లోనే తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 
 
రాయపూర్‌లోని పురానీ బస్తీ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, భాటాగావ్ ప్రాంతంలో మతమార్పిడులు జరుగుతున్నాయనే ఫిర్యాదులు పోలీసులకు అందాయి. దీంతో క్రైస్తవ సమాజానికి చెందిన మరికొందరితో కలిసి సదరు పాస్టర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. 
 
కొద్దిసేపటి తర్వాత అక్కడకు పెద్ద ఎత్తున హిందూ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల ముందే పాస్టర్‌ను హిందూ సంఘాల నేతలు చితకబాదారు. 
 
ఇది జరిగిన వెంటనే పాస్టర్‌ను స్టేషన్ ఇన్ఛార్జి గదిలోకి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments