Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఏడాది దేశంలో మంచి వర్షాలే కురుస్తాయి.. పంటలకు ఇబ్బంది వుండదు

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:14 IST)
2019 సంవత్సరానికి వాతావరణ అంచనాలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసింది. ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే నమోదవుతుంది ఐఎండీ తెలిపింది, అలాగే 96 శాతం సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంపై మే 15న ధ్రువీకరిస్తామన్నారు. 
 
ఈ ఏడాది దేశంలో మంచి వర్షాలే కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు. ఖరీఫ్‌లో రైతులకు అనుకూలంగా వర్షపాతం ఉండే అవకాశం ఉందన్నారు. గత రెండేళ్లలాగే ఈసారి కూడా సాధారణ వర్షాలు కురుస్తాయి. 
 
పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఎల్‌నినో ప్రభావం భారత్‌పై అంతగా ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాధారణ వర్షపాతమే నమోదవుతుంది. ఈ ఏడాది నుంచి ఉరుములు, పిడుగుపాటు హెచ్చరికల వ్యవస్థలను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments